సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: పటుశిష్టప్రతిపాలకుడ
టైటిల్: పటుశిష్టప్రతిపాలకుడ
పల్లవి:
ప|| పటుశిష్టప్రతిపాలకుడ వనగ | ఘటన నఖిలమును గాతువుగా ||
చరణం:చ|| తుత్తుమురుగ దైత్యుల దనుజుల నని | మొత్తిమోది చలమున జెలగి |
జొత్తుపాపలుగ సొరిది విరోధుల | నెత్తురు వడుతువు నీవేకా ||
చ|| తళతళమెరుచు సుదర్శనాయుధం- | బలరుచు నొకచే నమరగను |
బలుదైత్యులదొబ్బలు బేగులు నని | నిలువున జెండుదు నీవేకా ||
చ|| దిట్టవు సూత్రవతీపతి వసురల | జట్టలు చీరగ జతురుడవు |
రట్టడి వేంకటరమణుని వాకిట- | పట్టపుసేనాపతివటకా ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం