సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: పుడమి నిందరి
టైటిల్: పుడమి నిందరి
పల్లవి:
ప|| పుడమి నిందరి బట్టెభూతము కడు- | బొడవైన నల్లనిభూతము ||
చరణం:చ|| కినిసి వోడమింగెడి భూతము | పునుకవీపు పెద్దభూతము |
కనలి కవియు చీకటిభూతము | పొనుగు సోమపుమోము భూతము ||
చ|| చేటకాళ్ళ మించినభూతము | పోటుదారల పెద్దభూతము |
గాటపుజడల బింకపుభూతము | జూటరినల్లముసుగు భూతము ||
చ|| కెలసి బిత్తలేతిరిగేటి భూతము | పొలుపుదాంట్ల పెద్దభూతము |
బలుపు వేంకటగిరిపై భూతము | పులుగుమీది మహాభూతము ||