సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: పుట్టుభోగులము మేము
టైటిల్: పుట్టుభోగులము మేము
పల్లవి:
పుట్టుభోగులము మేము భువి హరిదాసులము
నట్టనడిమి దొరలు నాకియ్యవలెనా ||
పల్లకీలు నందనాలు పడివాగె తేజీలు
వెల్లవిరి మహాలక్ష్మీ విలాసములు
తల్లియాకె మగనినే దైవమని కొలిచేము
వొల్లగే మాకే సిరులు వొరులియ్యవలెనా ||
గ్రామములు వస్త్రములు గజముఖ్య వస్తువులు
ఆమని భూకాంతకు నంగభేదాలు
భామిని యాకె మగని ప్రాణధారి లెంకలము
వోలి మాకాతడే యిచ్చీ వొరులియ్యవలెనా ||
పసగల పదవులు బ్రహ్మ నిర్మితములు
వెస బ్రహ్మతండ్రి శ్రీ వేంకటేశుడు
యెసగి యాతడే మమ్మునేలి యిన్నియు నిచ్చె
వొసగిన మాసొమ్ములు వొరులియ్యవలెనా ||