సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: పుట్టుభోగులము నేము
టైటిల్: పుట్టుభోగులము నేము
పల్లవి:
ప|| పుట్టుభోగులము నేము భువి హరిదాసులము | నట్టనడిమి దొరలు నాకియ్యవలెనా ||
చరణం:చ|| పల్లకీలు నందనాలు పడివాగె తేజీలు | వెల్లవిరి మహాలక్ష్మీ విలాసములు |
తల్లియాకె మగనినే దైవమని కొలిచేము | వొల్లగే మాకే సిరులు వొరులియ్యవలెనా ||
చ|| గ్రామములు వస్త్రములు గజముఖ్య వస్తువులు | ఆమని భూకాంతకు నంగభేదాలు ||
భామిని యాకె మగని ప్రాణధారి లెంకలము | వోలి మాకాతడే యిచ్చీ వొరులియ్యవలెనా ||
చ|| పసగల పదవులు బ్రహ్మ నిర్మితములు | వెస బ్రహ్మతండ్రి శ్రీ వేంకటేశుడు |
యెసగి యాతడే మమ్మునేలి యిన్నియు నిచ్చె | వొసగిన మాసొమ్ములు వొరులియ్యవలెనా ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం