సంకీర్తన
టైటిల్: రాధామాధవరతిచరితమితి
రాధామాధవరతిచరితమితి - బోధావహం శ్రుతిభూషణం
చరణం:గహనే ద్వావపి గత్వా గత్వా - రహసి రతిం ప్రేరయతి సతి
విహరతస్తదా విలసంతౌ - విహతగృహాశౌ వివశౌ తౌ
లజ్జాశభళ విలాసలీలయా - కజ్జలనయన వికారేణ
హృజ్జావ్యవ(న)హృత (హిత?) హృదయా రతి - స్సజ్జా సంభ్రమచపలా జాతా
పురతో యాంతం పురుషం వకుళైః - కురంటకైర్వా కుటజైర్వా
పరమం ప్రహరతి పశ్చాల్లగ్నా- గిరం వినాసి వికిరతి ముదం
హరి సురభూరుహ మర్హతివస్వ -(మారోహతీవ?) - చరణేన కటిం సంవేష్ట్య
పరిరంచణ సంపాదితపులకై - స్సురుచిర్జాతా సుమలతికేవ
విధుముఖదర్శన వికళితలజ్జా- త్వధరబింబఫలమాస్వాద్య
మధురోపాయనమార్గేణ కుచౌ - నిధివద(ద్ద?) త్వా నిత్యసుఖమితా
సురుచిరకేతక సుమదళ నఖరై- ర్వరచిబుకం సా పరివృత్య (వర్త్య?)
తరుణిమసింధౌ తదీయదృగ్జల-చరయుగళం సంసక్తం చకార
వచన విలాసైర్వశీకృత(త్య?) తం- నిచులకుంజ మానితదేశే
ప్రచురసైకతే పల్లవశయనే- రచితరతికళా రాగేణాస
అభినవకల్యాణాంచితరూపా- వభినివేశ సంయతచిత్తౌ
బభూవతు స్తత్పరౌ వేంకట - విభుణా(నా?) సా తద్విధినా సతయా
సచ లజ్జావీక్షణో భవతి తం - కచభరాం(ర?) గంధం ఘ్రాపయతి
నచలతిచేన్మానవతీ తథాపి - కుచసంగాదనుకూలయతి
అవనతశిరసాప్యతి సుభగం- వివిధాలాపైర్వివశయతి
ప్రవిమల కరరుహరచన విలాసై - ర్భువనపతి(తిం?) తం భూషయతి
లతాగృహమేళనం నవసై - కతవైభవ సౌఖ్యం దృష్ట్వా
తతస్తతశ్చరసౌ (శ్చరతస్తౌ?) కేలీ- వ్రతచర్యాం తాం వాంఛంతౌ
వనకుసుమ విశదవరవాసనయా- ఘనసారరజోగంధైశ్చ
జనయతి పవనే సపది వికారం- వనితా పురుషౌ జనితాశౌ
ఏవం విచరన్ హేలా విముఖ- శ్రీవేంకటగిరి దేవోయం
పావనరాధాపరిరంభసుఖ- శ్రీ వైభవసుస్థిరో భవతి