సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: రామ రామచంద్ర
టైటిల్: రామ రామచంద్ర
పల్లవి:
ప|| రామ రామచంద్ర రాఘవా రాజీవలోచన రాఘవా |
సౌమిత్రిభరతశత్రుఘ్నలతోడ జయమందు దశరథరాఘవా ||
చ|| శిరసుకూకటులరాగవా చిన్నారిపొన్నారిరాఘవా |
గరిమ నావయసున దాటకి జంపిన కౌసల్యనందన రాఘవా |
అరిదియజ్ఞముగాచు రాఘవా అట్టె హరివిల్లువిరచినరాఘవా |
సిరులతో జనకునియింటను జానకి జెలగిపెండ్లాడిన రాఘవా ||
చ|| మలయునయోధ్యారాఘవా మాయామృగాంతకరాఘవా |
చెలగి చుప్పనాతిగర్వ మడచి దైత్యసేనల జంపినరాఘవా |
సొలసి వాలి జంపి రాఘవా దండిసుగ్రీవునేలినరాఘవా |
జలధిబంధించినరాఘవా లంకసంహరించినరాఘవా ||
చ|| దేవతలుచూడ రాఘవా నీవు దేవేంద్రురథమెక్కి రాఘవా |
రావణాదులను జంపి విభీషణు రాజ్యమేలించిన రాఘవా |
వేవేగ మరలి రాఘవా వచ్చి విజయపట్టమేలి రాగవా |
శ్రీవేంకటగిరిమీద నభయము చేరిమాకిచ్చిన రాఘవా ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం