సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: రమ్మనగా దనతో
టైటిల్: రమ్మనగా దనతో
పల్లవి:
ప|| రమ్మనగా దనతో నే రానంటినా | చిమ్మును నింత ప్రియముచెప్ప నేలెనాకు ||
చరణం:చ|| వెల్లవిరి దనమాట విననైతినా నేను | చెల్లబో నాకేల సేవ సేసీనె తాను |
యెల్లవారి దానేలీ నెవ్వరి బోలుదు నేను | బల్లిదుడు నాకేల బాతిపడె దానూ ||
చ|| చెప్పినట్లెల్లా నేను సేయకుండే దాననా | అప్పటి లేక లేటికి నంపీనె తాను |
కప్పురపు పడిగల కాంతలు గాచుకుండగా | విప్పుచు నాకుగా నేల వేగించీనె తానూ ||
చ|| గక్కన దాగూడగాను కాదు గూడదంటినా | ముక్కుమోప సాగిలేల మొక్కినె తాను |
యెక్కువ శ్రీ వేంకటేశుడెనసె దానన్ను నిట్టె | పెక్కు సతులలోననె పెద్దసేసీ దాను ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం