సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: రమ్మనవే ఇకను
టైటిల్: రమ్మనవే ఇకను
పల్లవి:
ప|| రమ్మనవే ఇకను నీ రమణునిని | పమ్మి వలపులు చల్లీ బదిమారులు ||
చరణం:చ|| నెలకొన్నప్పటినుండీ నిన్నే తప్పక చూచీ | తలపోసి తలపోసి తడబడీని |
మొలక నవ్వులతోడ మూతులు గిరిపీనదె | నలువంక పొంచి పొంచి నవ్వులు నవ్వీని ||
చ|| పెనగుచు బలుమారు పెచ్చుపెరిగీ దాను | గునిసి పరులమీద కోపగించీని |
వెనుకొని నీ జాడలే వెదకీ నితడు నేడు | మనసుమర్మాలు చూడమచ్చిక సేసీని ||
చ|| పొరుగు పొంతలనుండి బుద్ధులు చెప్పేనదె | గరిమల మించీ గలికి తనమునను |
యిరవై శ్రీ వేంకటేశుడిన్నిటా నిన్ను గలసె | సరసములాడు తానే చనవు చూపీని ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం