సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: రసికుడ తిరుపతి
టైటిల్: రసికుడ తిరుపతి
పల్లవి:
ప|| రసికుడ తిరుపతి రఘువీరా | కొసరుగాదు నాలోని కూరిములు గాని ||
చరణం:చ|| వెలయ నీ విరిచిన విల్లువంటిది గాదు | విలసిల్ల నాబొమ్మల విండ్లు గాని |
చెలగి తపసుచేసీ చిత్రకూటగిరి గాదు | గిలుకొట్టు నా కుచగిరులు గాని ||
చ|| మేటివైన నీవు వేసిన మొకము చూపు గాదు | సూటి దప్పని నా కనుచూపులు గాని |
గాటమై నీవు సేతువుగట్టిన జలధి గాదు | చాటున నా చెమటల జలధులు గాని ||
చ|| తగ నీవు గెలచిన దనుజ యుద్ధము గాదు | దగతోడి నా మదన యుద్ధము గాని |
నగు శ్రీ వేంకటేశ కనకసతి పొందు గాదు | పొగడే సీతనైన నా పొందులు గాని ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం