సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: రూకలై మాడలై
టైటిల్: రూకలై మాడలై
పల్లవి:
ప|| రూకలై మాడలై రువ్వలై తిరిగీని | దాకొని వున్నచోట దానుండ దదివో ||
చరణం:చ|| వొకరి రాజుజేసు నొకరి బంటుగ జేసు | వొకరి కన్నెకల వేరొకరికి నమ్మించు |
వొకచోటనున్నధాన్య మొకచోట వేయించు | ప్రకటించి కనకమే భ్రమయించీ జగము ||
చ|| కొందరిజాళెలు నిండు కొందరికి సొమ్ములవు | కొందరి పుణ్యులజేసు గొందరి పాపులజేసు |
కొందరికొందరిలోన కొట్లాట వెట్టించు | పందెమాడినటువలె బచరించు పసిడీ ||
చ|| నిగనిగమనుచుండు నిక్షేపమై యుండు | తగిలి శ్రీవేంకటేశుతరుణియై తా నుండు |
తెగనిమాయై యుండు దిక్కు దెసయై యుండు | నగుతా మాపాల నుండి నటియించు బసిడీ ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం