సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: సామాన్యమా పూర్వ
టైటిల్: సామాన్యమా పూర్వ
పల్లవి:
ప|| సామాన్యమా పూర్వ సంగ్రహంబగు ఫలము | నేమమున బెనగొనియె నేడు నీవనక ||
చరణం:చ|| జగతి బ్రాణులకెల్ల సంసారబంధంబు | తగుల బంధించు దురితంపు గర్మమున |
మగుడ మారుకుమారు మగువ నీయురముపై | తెగి కట్టిరెవ్వరో దేవుండ వనక ||
చ|| పనిలేని జీవులను భవసాగరంబులో మునుగ లేవగ జేయు మోహదోషమున |
పనిపూని జలధిలో బండబెట్టిరి నిన్ను | వెనకెవ్వరో మొదలి వేలువనక ||
చ|| ఉండనీయక జీవనోపాయమున మమ్ము | కొండలను గొబల దతి గొని త్రిప్పుఫలము |
కొండలను నెలకొన్న కోనేటి పతి వనగ | నుండవలసెను నీకు నోపలేవనక ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం