సంకీర్తన

రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: సారె దూర జాలనూ
పల్లవి:

ప|| సారె దూర జాలనూ చలముల కోపమా | చేరితిమా చనవోలి చెన్నుని భ్రమలను ||

చరణం:

చ|| యీడకు బిలుపించెను యేమి సేయుమనీ నే- | వోడక తన యెదుట నున్నదానను |
పాడితో నీట ముంచనీ పాలముంచనీ తాను | వాడు దనవలపుల వలకు లోనైతిని ||

చరణం:

చ|| మాటనన్ను నాడించెను మనసెట్టు దెలిసీ నే- | యేటికైనా నియ్యకొంటి నిదివో నేను ||
నాటిమాట చెల్లించీనా నగనీ తెగడనీ | మేటి పాయము తనకే మీదుగా నెత్తితిని ||

చరణం:

చ|| కాగిట నన్నునించెను కళ దాకె నిక నేలే- | దాగక తనకు నిట్టె దక్కితి నేను |
వీగక శ్రీ వేంకటాద్రి విభుడు దానన్ను గూడె | యేగించనీ రేగించనీ యిరవైతి నేను ||

అర్థాలు



వివరణ

సంగీతం

పాడినవారు
సంగీతం