సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: సాసముఖా నడె
టైటిల్: సాసముఖా నడె
పల్లవి:
ప|| సాసముఖా నడె సాసముఖా | ఆసలసరివారము అవధారు దేవా ||
చరణం:చ|| మత్తిల్లి జీవుడనేటి మహిమగలుగురాజు | చిత్తమనియెడి పెద్దసింహాసనంబెక్కి |
బత్తితో బంచేంద్రియపుపరివారము గొలువ | చిత్తజుపారుపత్యము సేసీ నిదివో ||
చ|| కడుమదించి నహంకారమనేయేనుగపై | యెడనెడ నెక్కి తోలీ నిదె జీవుడనురాజు |
బడిబడి గర్మముల పౌజులు దీర్చరో | వెడమాయపట్టపువీధుల నేగీని ||
చ|| మించినసంసారమనేమేడలో నేకాంతమున | పొంచి జీవుడనేరాజు భోగము భోగించగా |
అంచెల శ్రీవేంకటేశుడనేదేవుడు వచ్చి | మంచితనమున దానె మన్నించె నదివో ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం