సంకీర్తన

రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: సదా సకలము
పల్లవి:

ప|| సదా సకలము సంపదలే | తుద దెలియగవలె దొలగగవలయు ||

చరణం:

చ|| అహర్నిశలు నాపదలే | సహించిన నవి సౌఖ్యములే |
ఇహముననవి యిందరికిని | మహిమ దెలియవలె మానగవలెను ||

చరణం:

చ|| దురంతము లివి దోషములే | పరంపర లివి బంధములు |
విరసములౌ నరవిభవములౌ- | సిరులే మరులౌ చిరసుఖ మవును ||

చరణం:

చ|| గతి యలమేల్మంగ నాంచారికి | బతియగువేంకటపతి దలచి |
గతు లెరుగగవలె రవణము వలెను | హిత మెరుగగవలె నిదె తనకు ||

అర్థాలు



వివరణ

సంగీతం

పాడినవారు
సంగీతం