సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: సడిబెట్టె గటకటా
టైటిల్: సడిబెట్టె గటకటా
పల్లవి:
ప|| సడిబెట్టె గటకటా సంసారము చూడ | జలధిలోపలియీత సంసారము ||
చరణం:చ|| జమునోరిలో బ్రదుకు సంసారము చూడ | చమురుదీసినదివ్వె సంసారము |
సమయించుబెనుదెవులు సంసారము చూడ | సమరంబులో నునికి సంసారము ||
చ|| సందిగట్టినతాడు సంసారము చూడ | సందికంతలతోవ సంసారము |
చందురునిజీవనము సంసారము చూడ | చంద మేవలెనుండు సంసారము ||
చ|| చలువలోపలివేడి సంసారము చూడ | జలపూతబంగారు సంసారము |
యిలలోన దిరువేంకటేశ నీదాసులకు | చలువలకు గడుచలువ సంసారము ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం