సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: సేస పెట్టవయ్యా
టైటిల్: సేస పెట్టవయ్యా
పల్లవి:
సేస పెట్టవయ్యా యిట్టి చెలిమీదను
ఆసలమీకిద్దరికి నన్నిటా నమరును ||
గ్రక్కన జెట్టవట్టితే కంకణము వంటిదాపె
దక్కి వురమెక్కితేను తాళి వంటిది
మొక్కలాన దొడ దొక్కితే మొలనూలు వంటిది
అక్కజమై నీకు నాపె నన్నిటా నమరును ||
చేరి విన్నవించితే చెవి పోగుల వంటిది
నీరతికి వద్దనుంటే నీడవంటిది
కోరి పానుపుపై పెండ్లి కూతురు వంటిదేపొద్దు
ఆరీతి ఆపెకు నీకు నన్నిటా నమరును ||
పాదాల సేవ సేసితే పావకోళ్ళ వంటిది
సోదించి చూచితేను సొమ్ము వంటిది
యీదెస శ్రీవేంకటేశ యింతి నీవు గూడితివి
ఆదిగొని నీకు నాపె కన్నిటా నమరును ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం