సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: సేవించరో జనులాల
టైటిల్: సేవించరో జనులాల
పల్లవి:
ప|| సేవించరో జనులాల చేతులెత్తిమొక్కరో | వావిరి ప్రహ్లదునికి వరదుడు వీడే ||
చరణం:చ|| జగన్నాథుడు వీడే సర్వరక్షకుడు వీడే | నిగమవేద్యుడైన నిత్యుడు వీడే |
సుగుణవంతుడు వీడే సర్వకాముడు వీడే | నగుమొగము సుగ్రీవనరసింహుడు వీడే ||
చ|| మరుజనకుడు వీడే మహిమాధికుడు వీడే | పరగ శ్రీలక్ష్మీపతియు వీడే |
సురులకేలిక వీడే శుభమూరుతి వీడే | నరసఖుడు సుగ్రీవనరసింహుడు వీడే ||
చ|| భువనాధిపతి వీడే పురుషోత్తముడు వీడే | వివిధప్రతాప కోవిదుడు వీడే |
ఇవల శ్రీవేంకటాద్రి నిరవైనతడు వీడే | సవమూర్తి సుగ్రీవనరసింహుడు వీడే ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం