సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: సేయనివా డెవ్వడు చేరి
టైటిల్: సేయనివా డెవ్వడు చేరి
పల్లవి:
ప|| సేయనివా డెవ్వడు చేరి చిల్లరదోషాలు | యేయెడ జీవులజాడు లీశ్వరకల్పితమే ||
చరణం:చ|| దేవునినమ్మినయట్టిదేహియట యాతనికి | యీవల నెంతటిపాప మేమిసేసును |
భావించి యన్నినేరాలు పరిహరించు నతడే | ఆవటించుసూర్యునికి నంధకార మెదురా ||
చ|| పూజింపించుకొనేవాడు భువనరక్షకుడట | తేజముతో దురితాలు తెంచగలేడా |
రాజుసేసినయా ణాజ్ఞ రాజుకంటే నెక్కుడా | వోజతో వజ్రాయుధాన కోపునా పర్వతాలు ||
చ|| చేతనాత్మకుడట శ్రీవేంకటేశ్వరుడు | జాతిలేనిజీవునికి స్వతంత్ర మేది |
కాతరపుజన్మానకు గార్యకారణ మేది | యేతున గరుడనికి నెదురా పాములు ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం