సంకీర్తన

రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: సగము మానిసి రూపు
పల్లవి:

సగము మానిసి రూపు సగము మెగము రూపు
అగణిత ప్రతాపుడు అహోబలేశుడు

చరణం:

గద్దెమీద గూచున్నాడు కంబములో బుట్టినాడు
కొద్దిమీర గడునవ్వుకొంటా నున్నాడు
వొద్దనె శ్రీసతిచన్నులొరయచు నున్నవాడు
అద్దివో చూడరమ్మ అహోబలేశుడు

చరణం:

పెనుమీసాలవాడు పెదపెదగోళ్ళవాడు
ఘనునిగా ప్రహ్లాదుని గాచుకున్నాడు
మనసిచ్చిన సురలతో మాటలాడుచున్నవాడు
అనుపమతేజుడమ్మ అహోబలేశుడు

చరణం:

వేవేలు చేతులవాడు వెన్నెలచాయలవాడు
భావించి కొల్చినవారి పాలిటివాడు
శ్రీవేంకటగిరిమీద జేరి భవనాశిదండ-
నావల నీవల మించె నహోబలేశుడు

అర్థాలు



వివరణ

సంగీతం

పాడినవారు
సంగీతం