సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: సహజాచారములెల్ల
టైటిల్: సహజాచారములెల్ల
పల్లవి:
ప|| సహజాచారములెల్ల సర్వేశ్వరునియాజ్ఞే | అహమించి నమ్మకుండు టదియే పాషండము ||
చరణం:చ|| నిద్దిరించువానిచేతినిమ్మపంటివలెనే | చద్దికర్మములు తానే జారితే జారె |
పొద్దువొద్దు తనలోన భోగకాంక్షలుండగాను | అద్దలించి కర్మమెల్లననుటే పాషండము ||
చ|| కలగన్నవాడు మేలుకనినటువలెనే | తలగి ప్రపంచ మెందో దాగితే దాగె |
యిల్ల నీదేహము మోచి యింతా గల్లలనుచు | పలికి తప్పనడచేభావమే పాషండము ||
చ|| ధర నద్దముచూచేటి తనరూపమువలె | గరిమతో దనయాత్మ కంటే గనె |
సరుస శ్రీవేంకటేశు సాకారమటు గని | కరగి భజించలేనికష్టమే పాషండము ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం