సంకీర్తన

రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: శమముచాలనియట్టిజన్మం
పల్లవి:

ప|| శమముచాలనియట్టిజన్మం బిదేమిటికి | దమముచాలనియట్టితగు లిదేమిటికి ||

చరణం:

చ|| పగయునుబోలె నాపై సేయునడియాస | తగిలి యేపనేకాని దయ గొంత లేదు |
జగడమునబోలె నలసతిలేనిమమత దను | తెగి వేచనేకాని తీరుగడ లేదు ||

చరణం:

చ|| ఋణమునుబోలె తీరియుదీరనిది కర్మ | గణనగలకాలంబు కడ మొదలు లేదు |
వ్రణమునుబోలె విడువక రాగదేహజపు- | గుణము సౌఖ్యముతెరువు గొంతయును ||

చరణం:

చ|| నీతియుబోలె బ్రాణికి వేంకటేశుకృప | చేతికి నిధానంబు చేరినట్లాయ |
భూతములుబోలె తలపున కితరసంస్మరణ- | భీతిపుట్టించి యప్రియభావమాయ ||

అర్థాలు



వివరణ

సంగీతం

పాడినవారు
సంగీతం