సంకీర్తన

రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: శోభనమే శోభనమే
పల్లవి:

ప|| శోభనమే శోభనమే వై- | భవముల పావన మూర్తికి ||

చరణం:

చ|| అరుదుగ మును నరకాసురుడు | సిరులతో జెరలు దెచ్చిన సతుల |
పరువపు వయసుల బదారు వేలను | సొరిది బెండ్లాడిన సుముఖునికి ||

చరణం:

చ|| చెందిన వేడుక శిశుపాలుడు | అంది పెండ్లాడగ నవగళించి |
విందువలెనె తా విచ్చేసి రుకుమిణి | సందడి బెండ్లాడిన సరసునుకి ||

చరణం:

చ|| దేవదానవుల ధీరతను | దావతిపడి వార్థి దరుపగను |
శ్రీ వనితామణి జెలగి పెండ్లాడిన | శ్రీ వేంకటగిరి శ్రీనిధికి ||

అర్థాలు



వివరణ

సంగీతం

పాడినవారు
సంగీతం