సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: శ్రీ వేంకటేశ్వరుని సింగారము
టైటిల్: శ్రీ వేంకటేశ్వరుని సింగారము
పల్లవి:
ప|| శ్రీ వేంకటేశ్వరుని సింగారము వర్ణించితే | యే విధాన దలచిన యిన్నటికి దగును ||
చరణం:చ|| కరిరాజు గాచిన చక్రము పట్టిన హస్తము | కరి తుండమని చెప్పగా నమరును |
వరములిచ్చేయట్టి వరద హస్తము కల్ప- | తరు శాఖయని పొలుప దగు నీకును ||
చ|| జలధి బుట్టిన పాంచజన్య హస్తము నీకు | జలధి తరగయని చాటవచ్చును |
బలు కాళింగుని తోక పట్టిన కటి హస్తము | పొలుపై ఫణీంద్రుడని పొగడగ దగును ||
చ|| నలిన హస్తంబుల నడుమనున్న నీయుర- | మలమేలు మంగ కిరవన దగును |
బలు శ్రీ వేంకట గిరిపై నెలకొన్న నిన్ను | నలరి శ్రీ వేంకటేశుడన దగును ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం