సంకీర్తన

రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: శ్రీహరిసేసినచిహ్నలివి
పల్లవి:

ప|| శ్రీహరిసేసినచిహ్నలివి యీ- | మోహము విడుచుట మోక్షమది ||

చరణం:

చ|| మలినంబేది మణుగననేది | కలుషపుమలముల కాయమిది |
కలిగినదేది కడులేందేది | చలనపుమాయల జన్మమిది ||

చరణం:

చ|| తనిసినదేది తనియనిదేది | దినదినమాకలి దీరదిది |
కొనయిందేది గురిమొదలేది | పనిగొనుకర్మపు బంధమిది ||

చరణం:

చ|| నిండినదేది నిండనిదేది | కొండలపొడపుల కోరికది |
అండనే శ్రీ వేంకటాధిపు శరణని | వుండుటె యిహపర యోగమది ||

అర్థాలు



వివరణ

సంగీతం

పాడినవారు
సంగీతం