సంకీర్తన

రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: శ్రీవేంకటేశుడు
పల్లవి:

ప|| శ్రీవేంకటేశుడు శ్రీపతియు నితడే | పావనపువైకుంఠపతియును నితడే ||

చరణం:

చ|| భాగవతములో జెప్పే బలరాముతీర్థయాత్ర- | నాగమోక్తమైనదైవ మాత డితడే |
బాగుగా బ్రహ్మాండపురాణపద్ధతియాత డితడే | యోగమై వామనపురాణోక్తదైవ మీతడే ||

చరణం:

చ|| వెలయ సప్తఋషులు వెదకి ప్రదక్షిణము- | లలర జేసినదేవు డాత డీతడే |
నెలవై కోనేటిపొంత నిత్యము గుమారస్వామి | కలిమి దనముసేసి కన్నదేవు డీతడే ||

చరణం:

చ|| యెక్కువై బ్రహ్మాదులు నెప్పుడు నింద్రాదులు | తక్కక కొలిచియున్న తత్త్వ మీతడే |
చక్క నారదాదులసంకీర్తనకు జొక్కి | నిక్కినశ్రీవేంకటాద్రినిలయుడు నీతడే ||

అర్థాలు



వివరణ

సంగీతం

పాడినవారు
సంగీతం