సంకీర్తన

రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: శరణంబితడే సకలము
పల్లవి:

ప|| శరణంబితడే సకలము నాకును | వెరవున మనసా వెతకవో ఇతని ||

చరణం:

చ|| అభయంబొసగెడి యతడెవ్వడు మును | ఇభరక్షకుడు అతడెవ్వడు |
ఉభయవిభూతుల కొడయండెవడూ | ప్రభువితడే నాపాలి దేవుడు ||

చరణం:

చ|| శరణాగతులకు సరి దా నెవ్వడు | యిరవుగ శ్రీపతి యెవ్వడు |
అరి దుష్ట దైత్య హంతకు డెవ్వడు | పరమును నతడె నాపాలి దేవుడు ||

చరణం:

చ|| ఆది శంఖ చక్రాయుధు డెవ్వడు | యేదెస పూర్ణు డెవ్వడు |
వేదమయుడు శ్రీ వేంకట పతియై | పాదాయ నిదె నా పాలిదేవుడు ||

అర్థాలు



వివరణ

సంగీతం

పాడినవారు
సంగీతం