సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: శరణంటి మాతనిసమ్మంధమున
టైటిల్: శరణంటి మాతనిసమ్మంధమున
పల్లవి:
శరణంటి మాతనిసమ్మంధమున
మరిగించి మమునేలి మన్నించవే ॥పల్లవి॥
సకలవేదములు సంకీర్తనలు చేసి
ప్రకటించి నిను బాడి పావనుడైన
అకలంకుడు తాళ్ళపాకన్నమాచార్యుల
వెకలియై యేలిన శ్రీవేంకటనిలయ ॥శర॥
నారదాది సనకసనందనాదులవలె
పేరుపడి నిన్ను బాడి పెద్దలైనట్టి
ఆరీతి దాళ్ళపాకన్నమాచార్యుల
చేరి యేలినయట్టి శ్రీ వేంకటనిలయ ॥శర॥
సామవేదసామగానసప్తస్వరములను
బాముతో నీసతి నిన్ను బాడినయట్టి
ఆముకొన్న తాళ్ళపాకన్నమాచరుల
వేమరు మెచ్చిన శ్రీ వేంకటనిలయా ॥శర॥
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం