సంకీర్తన

రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: శరణు కపీశ్వర
పల్లవి:

శరణు కపీశ్వర శరణం బనిలజ
సరవి నెంచ నీసరి యిక వేరీ

చరణం:

పుట్టిననాడే భువనములెరరగగ
పట్టితి సూర్యుని పండనుచు
ముట్టిన చుక్కలు మోవగ పెరిగితి(వి)
ఇట్టిప్రతాపివి యెదురేదయ్యా

చరణం:

అంపినయప్పుడే యంబుధి దాటితివి
ఇంపులు సీతకు నిచ్చితివి
సంపద మెరయుచు సంజీవి దెచ్చితి
పెంపును సొంపును పేర్కొనవశమా

చరణం:

చెదరక నేడే శ్రీవేంకటగిరి
గదిసి రాముకృప గైకొంటి
వదలక నీకృపవాడనైతి నిదె
యెదుటనే కాచితి విక కడమేమీ

అర్థాలు



వివరణ

సంగీతం

పాడినవారు
సంగీతం