సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: శరణు శరణు రామచంద్ర
టైటిల్: శరణు శరణు రామచంద్ర
పల్లవి:
శరణు శరణు రామచంద్ర నరేంద్రా
సరి మమ్ముగావు రామచంద్రా నరేంద్రా
ఘన దశరథునకు కౌసల్యాదేవికిని
జననమందిన రామచంద్రా నరేంద్రా
కనలి తాటకి చంపి కౌశుకుజన్నము గాచి
చనవులిచ్చిన రామచంద్రా నరేంద్రా
అరిది సీత పెండ్లాడి అభయమందరికిచ్చి
శరధిగట్టిన రామచంద్రా నరేంద్రా
అరసి రావణు చంపి అయేధ్యానగర మేలి
సరవినేలిన రామచంద్రా నరేంద్రా
పన్నుగ నలమేల్మంగపతి శ్రీవేంకటేశ్వరు
సన్నిధినిల్చిన రామచంద్రా నరేంద్రా
అన్నిటా లక్ష్మణభరతాంజనేయశత్రుఘ్నుల
సన్నుతికెక్కిన రామచంద్రా నరేంద్రా
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం