సంకీర్తన

రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీసతి వల్లభా
పల్లవి:

శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీసతి వల్లభా
శరణు రాక్షస గర్వ సంహర శరణు వెంకటనాయకా

చరణం:

కమలధరుడును కమలమిత్రుడు కమలశత్రుడు పుత్రుడు
క్రమముతో మీకొలువు కిప్పుడు కాచినా రెచ్చరికయా

చరణం:

అనిమిషేంద్రులు మునులు దిక్పతులమర కిన్నర సిద్ధులు
ఘనతతో రంభాదికాంతలు కాచినా రెచ్చరికయా

చరణం:

ఎన్నగల ప్రహ్లాద ముఖ్యులు నిన్ను గొలువగ వచ్చిరీ
విన్నపము వినవయ్య తిరుపతి వేంకటాచలనాయకా

అర్థాలు



వివరణ

సంగీతం

పాడినవారు
సంగీతం