సంకీర్తన

రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: శరణు శరణు వేద
పల్లవి:

శరణు శరణు వేద శాస్త్రనిపుణ నీకు
అరుదైన రామ కార్యదురంధరా

చరణం:

హనుమంతరాయ అంజనాతనయా
ఘనవాయుసుత దివ్యకామరూప
అనుపమలంకాదహన వార్ధిలంఘన
జనసురనుత కలశాపురనివాస

చరణం:

రవితనయస(న?)చివ రావణవనాపహార
పవనవేగబలాఢ్య భక్తసులభ
భువనపూర్ణదేహా బుధ్ధివిశారద
జవసత్వవేగ కలశాపురనివాస

చరణం:

సీతాశోకనాశన సంజీవశైలాకర్షణ
ఆతతప్రతాపశౌర్యా అసురాంతకా
కౌతుక శ్రీవేంకటేశు కరుణాసమేత
సాతకుంభవర్ణ కలశాపురనివాస

అర్థాలు



వివరణ

సంగీతం

పాడినవారు
సంగీతం