సంకీర్తన

రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: శరణు శరణు విభీషణ
పల్లవి:

శరణు శరణు విభీషణ వరదా
శరధిబంధన రామ సర్వగుణస్తోమ

చరణం:

మారీచసుబాహుమదమర్దన తాటకాహర
కౄరేంద్రజిత్తులగుండుగండా
దారుణకుంభకర్ణదనుజ శిరచ్ఛేదక
వీరప్రతాపరామ విజయాభిరామ

చరణం:

వాలినిగ్రహ సుగ్రీవరాజ్యస్థాపక
లాలితవానరబల లంకాపహార
పాలితసవనాహల్యపాపవిమోచక
పౌలస్త్యహరణ రామ బహుదివ్యనామ

చరణం:

శంకరచాపభంజక జానకీమనోహర
పంకజాక్ష సాకేతపట్టణాధీశ
అంకితబిరుద శ్రీవేంకటాద్రినివాస
ఓంకారరూప రామ వురుసత్యకామ

అర్థాలు



వివరణ

సంగీతం

పాడినవారు
సంగీతం