సంకీర్తన

రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: శరణువేడెద
పల్లవి:

ప|| శరణువేడెద యజ్ఞసంభవ శ్రీరామ | అరసి రక్షించుము అయోధ్యారామ ||

చరణం:

చ|| రావణనుని భంజించిన రాఘవ రామ | వావిరి విభీషణ వరద శ్రీరామ |
సేవనలమేల్మంగతో వేంకటేశుడై | ఈవల దాసుల ఏలినట్టి శ్రీరామ ||

చరణం:

చ|| ధారుణిలో దశరథ తనయ రామ |చేరిన యహల్యను రక్షించిన రామ |
వారిధి బంధన కపి వల్లభ రామ | తరక బ్రహ్మమైన సీతాపతి రామ ||

చరణం:

చ|| ఆదిత్య కులాంబుధి మృగాంక రామ హర- | కోదండ భంజనము చేకొనిన రామ |
వేద శాస్త్ర పురాణాది వినుత రామ | ఆది గొన్నతాటకా సంహార రామ ||

అర్థాలు



వివరణ

సంగీతం

పాడినవారు
సంగీతం