సంకీర్తన

రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: శతాపరాధములు
పల్లవి:

ప|| శతాపరాధములు సహస్రదండన లేదు | గతి నీవని వుండగ కావకుండగారాదు ||

చరణం:

చ|| తలచి నీకు మొక్కగా దయజూడకుండరాదు | కొలిచి బంటుననగా కోపించరాదు |
నిలిచి భయస్తుడనై నీయెదుట దైన్యమే | పలుక గావకుండ బాడిగాదు నీకు ||

చరణం:

చ|| శరణు చొరగ నీకు సారె నాజ్ఞ వెట్టరాదు | సరి బూరి గరవగ చంపరాదు |
అరయ జగద్రోహినౌదు నైనా నీనామము | గరిమె నుచ్చరించగ గరగక పోదు ||

చరణం:

చ|| దిక్కు నీవని నమ్మగా దిగవిడువగరాదు | యెక్కువ నీలెంకగాగా యేమనరాదు |
తక్కక శ్రీవేంకటేశ తప్పులెల్లా జేసి వచ్చి | యిక్కడ నీదాసినైతి నింక దోయరాదు ||

అర్థాలు



వివరణ

సంగీతం

పాడినవారు
సంగీతం