సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: సిగ్గరి పెండ్లి
టైటిల్: సిగ్గరి పెండ్లి
పల్లవి:
సిగ్గరి పెండ్లి కూతుర సీతమ్మ
దగ్గరి సింగారబొమ్మ తలవంచకమ్మా
అల్లనాడే రాఘవుడు హరివిల్లు విరిచెను
యెల్లినేడే పెండ్లాడీ నిదివో నిన్ను
యెల్లగా జనకుడు నిన్నిచ్చీనట వీడె
వెల్లవిరి నీమాట వినవమ్మా
అదె పెండ్లితెర యెత్తి రండనే వశిష్టుడుండి
చదివీ మంత్రాలు సేస చల్లవమ్మా
మొదల రాముని కంటె ముంచి తలంబ్రాలు వోసి
సుదతి యాతని మోము చూడవమ్మా
కంకణదారాలు గట్టి కాలుదొక్కితివి మీరు
పొంకాన బువ్వ మందరో పొత్తుల నమ్మ
వుంకువ వావిలిపాట నుండి శ్రీవేంకటగిరి
తెంకుల నిన్ను గూడి తిరమాయనమ్మా
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం