సంకీర్తన

రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: సీతాశోకవిఘాతక
పల్లవి:

ప|| సీతాశోకవిఘాతక వో-| పాతాళలంకాపతివిభాళా ||

చరణం:

చ|| హనుమమ్తరాయ అంజనీతనయ వో- | వనధిలంఘనగాత్ర వాయుపుత్రా |
యినకులాధిపనిజహిత జగన్నుత- | వనజోదరసేవక సత్వధనికా ||

చరణం:

చ|| ప్రళయాంతికరూప బలదీప రవిఫల- | గిళనప్రతాప సుగ్రీవప్రియా |
కుళికదానవసంకులవిదారణ | భళిభళి జగత్పతిబలుబంటా |

చరణం:

చ|| పంకజాసనుదివ్యపదవైభవ వో- | లంకిణీప్రాణవిలంఘన |
వేంకటేశ్వరుసేవావీర మహాధీర | కింకరరాయ సుఖీభవా ||

అర్థాలు



వివరణ

సంగీతం

పాడినవారు
సంగీతం