సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: సింగారమూరితివి
టైటిల్: సింగారమూరితివి
పల్లవి:
ప|| సింగారమూరితివి చిత్తజు గురుడవు | సంగతి జూచేరు మిమ్ము సాసముఖా ||
చరణం:చ|| పూవుల తెప్పలమీద పొలతులు నీవునెక్కి | పూవులు ఆకసము మోప పూచిచల్లుచు |
దేవదుందుభులు మ్రోయ దేవతలు కొలువగా | సావధానమగు నీకు సాసముఖా ||
చ|| అంగరంగవైభవాల అమరకామినులాడ | నింగినుండి దేవతలు నినుజూడగా |
సంగీత తాళవాద్య చతురతలు మెరయగ | సంగడిదేలేటి నీకు సాసముఖా ||
చ|| పరగ కోనేటిలోన పసిడి మేడనుండి | అరిది యిందిరయు నీవు ఆరగించి |
గరిమ శ్రీవేంకటేశ కన్నుల పండువకాగ | సరవి నోలాడు మీకు సాసముఖా ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం