సంకీర్తన

రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: సిరిదొలంకెడి
పల్లవి:

ప|| సిరిదొలంకెడి పగలూచీకటా యితడేమి | యిరవుదెలిసియు దెలియనియ్య డటుగాన ||

చరణం:

చ|| తలపోయ హరినీలదర్పణంబో ఇతడు | వెలుగుచున్నాడు బహువిభవములతోడ |
కలగుణంబటు వలెనెకాబోలు లోకంబు | గలదెల్ల వెలిలోన గనిపించుగాన ||

చరణం:

చ|| మేరమీరిననీలమేఘమా యితడేమి | భూరిసంపదలతో బొలయుచున్నాడు |
కారుణ్యనిధియట్ల కాబోలు ప్రాణులకు | కోరికలు దలపులో గురియు నటుగాన ||

చరణం:

చ|| తనివోని ఆకాశతత్త్వమో యితడేమి | అనఘుడీ తిరువేంకటాద్రి వల్లభుడు |
ఘనమూర్తి అటువలెనె కాబోలు సకలంబు | తనయందె యణగి యుద్భవమందుగాన ||

అర్థాలు



వివరణ

సంగీతం

పాడినవారు
సంగీతం