సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: సకల జీవులకెల్ల
టైటిల్: సకల జీవులకెల్ల
పల్లవి:
ప|| సకల జీవులకెల్ల సంజీవి యీమందు | వెకలులై యిందరు సేవించరో యీమందు ||
చరణం:చ|| మూడు లోకము లొక్కట ముంచి పెరిగినది | పోడిమి నల్లని కాంతి బొదలినది |
పీడుక కొమ్ములు నాల్గు పెనచి చేయువారినది | వాడే శేషగిరిమీద నాటుకొన్న మందు ||
చ|| పడిగెలు వేయింటి పాము గాచుకున్నది | కడు వేదశాస్త్రముల గబ్బు వేసీది |
యెడయక వొకకాంత యెక్కుక వుండినది | కడలేని యంజనాద్రి గారుడపు మందు ||
చ|| బలు శంఖు జక్రముల బదనికెలున్నది | తలచిన వారికెల్ల దత్త్వమైనది |
అలరిన బ్రహ్మరుద్రాదుల బుట్టించినది | వెలుగు తోడుత శ్రీవేంకటాద్రి మందు ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం