సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: సకలశాస్త్రసంపన్నుడట
టైటిల్: సకలశాస్త్రసంపన్నుడట
పల్లవి:
ప|| సకలశాస్త్రసంపన్నుడట చిత్త- | మొకటికిని జొరదు విధియోగమౌగాదో ||
చరణం:చ|| దొరతనంబట కలిమి దోడుగాదట మంచి- | తరుణులట మోహమట దైన్యంబట |
విరహమట దారిద్ర్యవివశుడౌనట చూడ- | నరయ నిది కర్మఫలమౌనో కాదో ||
చ|| రాజసన్మానమట రవణహీనత్వమట | తేజమట నలువంక దిరిపెంబట |
వాజివాహనములట వాడిలేదట తొంటి- | పూజఫలమిది వెలితిభోగమౌగాదో ||
చ|| యిలయెల్ల నేలునట ఇంటలేదట మిగుల | బలిమిగలదట సడా పరిభవమట |
చెలువలర వేడుకల శ్రీవేంకటేశ్వరుని | గొలువనేరనివెనక గొరతలౌగాదో ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం