సంకీర్తన

రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: సకలసందేహమై
పల్లవి:

ప|| సకలసందేహమై జరుగుచున్నది యొకటి | ప్రకటింప జీవమో బ్రహ్మమో కాని ||

చరణం:

చ|| వసుదేవజఠరమనువననిధికి జంద్రుడై | అసమానగతి బొడమినా డితడు |
వసుధ జంద్రుడు నీలవర్ణు డేటికినాయ | కసరెత్తి నునుగందు గలయగొనుబోలు ||

చరణం:

చ|| ఇనవంశమున లోకహితకల్పభూజమై | అనఘుడై జనియించినా డితడు |
నను పై నసురతరువు నల్లనేటికినాయ | పెనుగొమ్మలో చేగ పెరిగిరాబోలు ||

చరణం:

చ|| తిరువేంకటాద్రిపై దెలియ జింతామణై | అరిదివలె బొడచూపినా డితడు |
గరిమె నది యిపుడు చీకటివర్ణమేలాయ | హరినీలమణులప్రభ లలమికొనబోలు ||

అర్థాలు



వివరణ

సంగీతం

పాడినవారు
సంగీతం