సంకీర్తన

రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: సముఖ ఎచ్చరికవో
పల్లవి:

ప|| సముఖ ఎచ్చరికవో సర్వేశ్వరో | అమరె నీకొలువు ప్రహ్లాద వరద ||

చరణం:

చ|| తొడమీద కూచున్నది తొయ్యలి ఇందిరాదేవి | బడి చెలులు సోబాన పాడేరు |
నడుమ వీణె వాయించీ నారదుడల్ల వాడె | అడరి చిత్తగించు ప్రహ్లాద వరదా ||

చరణం:

చ|| గరుడోరగాచు లూడిగములు నీకుజేసేరు | ఇరుమేలా కొలిచేరు ఇంద్రాదులు |
పరమేష్ఠి ఒకవంక పనులు విన్నవించీ | అరసి చిత్తగించు ప్రహ్లాదవరదా ||

చరణం:

చ|| పొదిగొని మిమ్మునిట్టె పూజించేరు మునులెల్ల | కదిసి పాడేరు నిన్ను గంధర్వులు |
ముదమున అహోబలమునను శ్రీవేంకటాద్రిని | అదె చిత్తగించుము ప్రహ్లాదవరద ||

అర్థాలు



వివరణ

సంగీతం

పాడినవారు
సంగీతం