సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: సందడి విడువుము
టైటిల్: సందడి విడువుము
పల్లవి:
ప|| సందడి విడువుము సాసముఖా | మందరధరునకు మజ్జనవేళా ||
చరణం:చ|| అమరాధిపులిడు డాలవట్టములు | కమలజ పట్టుము కాళాంజి |
జమలి చామరలు చంద్రుడ సూర్యుడ | అమర నిడుడు పరమాత్మునకు ||
చ|| అణిమాది సిరులనలరెడు శేషుడ | మణిపాదుకలిడు మతి చెలగా |
ప్రణుతింపు కదిసి భారతీరమణ | గుణాధిపు మరుగురు బలుమరును ||
చ|| వేదఘోషణము విడువక సేయుడు | ఆదిమునులు నిత్యాధికులు |
శ్రీదేవుండగు శ్రీవేంకటపతి | ఆదరమున సిరు లందీ వాడె ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం