సంకీర్తన

రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: సందెకాడ బుట్టినట్టి
పల్లవి:

సందెకాడ బుట్టినట్టి చాయల పంట యెంత-
చందమాయ చూడరమ్మ చందమామ పంట॥

చరణం:

మునుప పాలవెల్లి మొలచి పండినపంట
నినుపై దేవతలకు నిచ్చపంట
గొనకొని హరికన్ను గొనచూపులపంట
వినువీధి నెగడిన వెన్నెలల పంట॥

చరణం:

వలరాజు పంపున వలపు విత్తిన పంట
చలువై పున్నమనాటి జాజరపంట
కలిమి కామిని తోడ కారుకమ్మినపంట
మలయుచు తమలోని మర్రిమాని పంట॥

చరణం:

విరహుల గుండెలకు వెక్కసమైన పంట
పరగచుక్కలరాసి భగ్యము పంట
అరుదై తూరుపుకొండ నారగబండినపంట
యిరవై శ్రీ వేంకటేశునింటిలోని పంట॥

అర్థాలు



వివరణ