సంకీర్తన

రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: సంసారినైన నాకు
పల్లవి:

ప|| సంసారినైన నాకు సహజమే | కంసారి నేనిందుకెల్లా గాదని వగవను ||

చరణం:

చ|| నరుడనైననాకు నానాసుఖదుఃఖములు | సరి ననుభవించేది సహజమే |
హరిని శరణాగతులైనమీద బరాభవ- | మరయ నిన్నంటునని అందుకే లోగేను ||

చరణం:

చ|| పుట్టిననాకు గర్మపు పొంగుకు లోనైనవాడ | జట్టిగ గట్టువడుట సహజమే |
యిట్టే నీవారికి మోక్షమిత్తునన్న నీమాట | పట్టు వోయీనోయని పంకించే నేనిపుడు ||

చరణం:

చ|| మాయకులోనైన నాకు మత్తుడనై యిన్నాళ్ళు | చాయకు రానిదెల్లా సహజమె |
యీయెడ శ్రీవేంకటేశ యేలితివి నన్ను నీవు | మోయరాని నేను మోపనివీగేను ||

అర్థాలు



వివరణ

సంగీతం

పాడినవారు
సంగీతం