సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: సంతగాడ విక
టైటిల్: సంతగాడ విక
పల్లవి:
ప|| సంతగాడ విక మమ్ము బాయకువయ్యా | బంతి చెట్టుకొని మమ్ము బాలార్చవయ్యా ||
చరణం:చ|| జవ్వనపు వారమో సముకపు వారమో | యెవ్వర మేమన్నా నెగ్గులెంచకువయ్యా |
నవ్వు నవ్వే వారమో ననుపైన వారమో | తవ్విన మోవి రసాల దప్పి దేర్చవయ్యా ||
చ|| సేవచేసే వారమో చిత్తములో వారమో | కావరించినా మమ్ముగై కొనవయ్యా |
పూవువంటివారమో భోగించేవారమో | వేవేలు మన్ననల వెలయించవయ్యా ||
చ|| కడుమేన వారమో కప్రపుబడివారమో | యెడయక ఇట్టె వీడేలియ్యవయ్య |
కడగి శ్రీ వేంకటేశ కలసిన నీ వారమో | జడియక యిట్లానే చనవియ్యవయ్యా ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం