సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: సంతలే చొచ్చితిగాని
టైటిల్: సంతలే చొచ్చితిగాని
పల్లవి:
ప|| సంతలే చొచ్చితిగాని సరకు గాననైతి | యింతట శ్రీహరి నీవే యిట దయజూడవే ||
చరణం:చ|| కాంతచనుగొండలు కడకునెక్కితిగాని | యెంతైనా మోక్షపుమెట్లు యెక్కలేనైతి |
అంతట జవ్వనమనే అడవి చొచ్చితిగాని | సంతత హరిభక్తనే సంజీవి గాననైతి ||
చ|| తెగి సంసారజలధి దిరుగలాడితిగాని | అగడైవైరాగ్యరత్నమది దేనైతి |
పొగరుజన్మాలరణభూములు చొచ్చితిగాని | పగటుగామాదులపగ సాధించనైతి ||
చ|| తనువనియెడికల్పతరువు యెక్కితిగాని | కొనవిజ్ఞానఫలము గోయనైతి |
ఘనుడశ్రీవేంకటేశ కమ్మర నీకృపచేత | దనిసి యేవిధులను దట్టుపడనైతి ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం