సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: సొగియునా మఱియు
టైటిల్: సొగియునా మఱియు
పల్లవి:
ప|| సొగియునా మఱియు ముచ్చుకు బండువెన్నెలలు | పగవానివలెనె లోపల దాగుగాక ||
చరణం:చ|| దక్కునా పేదకును తరముగానిధనంబు | చిక్కి యెవ్వరికైన జేరుగాక |
వెక్కసంబైన గోవిందునిదలపుబుద్ధి | తక్కినపరులకెల్ల దలపేల కలుగు ||
చ|| అరగునా దుర్బలున కరుదైనయన్నంబు | కురుచబుద్ధులను నరమిగొనుగాక |
తొరలునా హరివినుతి దుష్టునకు నది నోర- | దొరలెనా యతనినే దూషించుగాక ||
చ|| చెల్లునా యమృతంబు సేవించ నధమునకు | వొల్లనని నేలపై నొలుకుగాక |
వెల్లిగొనుమందునకు వేంకటేశుస్మరణ | చల్లనౌనా మనసు కఠియించుగాక ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం