సంకీర్తన

రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: సొంపుల నీ
పల్లవి:

సొంపుల నీ వదనపు సోమశిలకనుమ
యింపులెల్ల జేకొనగ నిల్లు నీవతికి ||

చరణం:

కలికి నీ పిఋదనే గద్దె రాతి కనుమ
మొలనూళ్ళ లతలనే ముంచుకున్నది
కలయ బోకముడినే కట్లు వడ్డది
అలరు విలుతు దాడికడ్డము నీ పతికి ||

చరణం:

ఇదివో నీ కెమ్మోవి యెఅశిలకనుమ
కదిసి లేజిగురుల గప్పుకొన్నది
వదలకింతకు దలవాకిలైనది
మదనుని బారికి మాటువో నీపతికి ||

చరణం:

కాంతనీ చిత్తమే దొంగలసాని కనుమ
ఇంతటి వేంకటపతికిరవైనది
పంతపు నీ గుబ్బలే గుబ్బలికొండకనుమ
మంతనాల కనుమాయ మగువ నీపతికి ||

అర్థాలు



వివరణ

సంగీతం

పాడినవారు
సంగీతం