సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: సొరిది సంసారంబు
టైటిల్: సొరిది సంసారంబు
పల్లవి:
ప|| సొరిది సంసారంబు సుఖమా యిందరికి | వెరవెఱంగక వగల వేగేరుగా ||
చరణం:చ|| దేహములు దలప సుస్థిరములా ప్రాణులకు- | నూహింప లోభ మట్లుండుగాక |
మోహంబుచే వెనుకముందెఱుగలేక తమ- | దేహసుఖములు మరిగి తిరిగేరుగాక ||
చ|| నెలకొన్నద్రవ్యములు నిలుచునా యెవ్వరికి | అలవి నిలుపగరాని యాసగాక |
బలువైనవట్టిభ్రాంతిచే దగులువడి | తెలిసియును దెలియకిటు తిరిగేరుగాక ||
చ|| నెఱయువిభవములెల్ల నిజములా యిందరికి | కొఱమాలినట్టి తమగుణముగక |
యెఱుకతో దిరువేంకటేశు గొలువగలేక | తెఱగుమాలినబుద్ధి దిరిగేరుగాక ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం